జియో.. వీడియో కాన్ఫరెన్స్ యాప్ వచ్చేసింది !

టెలికాం సంచలనం జియో నుంచి కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్ ని లాంచ్ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ కు ప్రాధాన్యత పెరిగింది. ఈ పరిస్తితిని క్యాష్ చేసుకుంటూ.. ‘జియో మీట్’‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ తీసుకొచ్చింది. ఇది ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ లోనైనా పని చేయగలదు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు.

ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్‌ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియో మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. జియో ఇహెల్త్, ఇఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని అనుసంధించారు. ఫ్రీప్లాన్‌లో 5గురు వినియోగదారులు, బిజినెస్‌ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్‌ పాల్గొనే అవకాశాన్ని కల్పించనుంది.