గుడ్ న్యూస్ : మద్యం షాపులకి కేంద్రం అనుమతి

మందు బాబులకి గుడ్ న్యూస్. మద్యం షాపులు తెరచుకోనున్నాయి. ఈ నెల 3న ముగియనున్న లాక్ డౌన్ ను కేంద్రం మే 17వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గ్రీన్, ఆరేంజ్ జోన్ లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతోపాటు మద్యం షాపులకి అనుమతిని ఇచ్చింది. గ్రీన్, ఆరేంజ్ జోన్లలో మద్యం షాపులు తెరచుకోనున్నారు. షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ఇచ్చింది.

దేశంలో కరోనా కట్టడి కోసం మొదట 21రోజుల పాటు (ఏప్రిల్ 14 వరకు) కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దానిని మే 3 వరకు పొడగించింది. తాజాగా మరోసారి రెండు వారాల పాటు లాక్ డౌన్ ని పొడగిస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. దీంతో మే 17 వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగనుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేయనుంది.