రేపు జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం 10గంటలకి జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. మే 3 తర్వాత కూడా దేశంలో లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేపటి ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతని సంతరించుకుంది.

కరోనా కట్టడి కోసం కొనసాగింపు చర్యలు, లాక్ డౌన్ పొడగింపు,  గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు, కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఆంక్షలు తదితర అంశాలపై ప్రధాని ప్రసంగించనున్నారు. దీంతో పాటు దేశ ఆర్థిక స్థితిపై ప్రధాని మాట్లాడే ఆస్కారం ఉంది. దీంతో పాటు పేదల కోసం సరికొత్త పథకం ఏమైనా తీసుకొస్తారా ? అన్నది చూడాలి.