సందీప్ కి విజయ్ రిక్వెస్ట్

టాలీవుడ్ కి ఓ స్టార్ ని అందించాడు సందీప్ వంగా. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇదే సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ ని తీసి.. అక్కడ హిట్ కొట్టాడు. ఆయన తదుపరి సినిమా కూడా బాలీవుడ్ లోనే అనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సందీప్ వంగాకి విజయ్ రిక్వెస్ట్ చేసారు. “నిన్ను మిస్ అవుతున్న వంగా.. లాక్‌డౌన్  టైమ్‌లో రెండు, మూడు స్క్రిప్ట్స్ రాయి.. నేను రెండేళ్లు వెయిట్ చేయ‌లేను’’ అంటూ విజయ్ ట్విట్ చేశారు. దీంతో సందీప్ తో మరో సినిమా చేసేందుకు విజయ్ ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు స్పష్టం అవుతోంది.