రామరాజు ఫర్ భీమ్.. ఓ హింట్ ఇచ్చిన కీరవాణి !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్. మే20 తారక్ బర్త్ డే. అయితే శుక్రవారం (మే1) నుంచే తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు అభిమానులు. #NTRBdayFestBegins హాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. దీనికి రికార్డ్ వ్యూస్ వచ్చాయి. ఇక తారక్ పుట్టినరోజు కానుకగా మే 20న ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన ‘రామరాజు ఫర్ భీమ్’ మోషన్ పోస్టర్ రానుంది.

వాస్తవానికి కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ‘రామరాజు ఫర్ భీమ్’ రెడీ చేయడం కష్టంగా మారిందని దర్శకధీరుడు రాజమౌళి అన్నారు. అయితే అభిమానుల కోసం ఉన్నంతలో రామరాజు ఫర్ భీమ్ ని రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది ఎలా ఉండబోతుంది. తారక్ ఎంట్రీ ఎలా ఉంటుంది ? అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు కీరవాణి ఓ హింట్ ఇచ్చారు. 

రామ్ చరణ్ బర్త్ డే కానుకగా వచ్చిన ‘భీమ్ ఫర్ రామరాజు’ మోషన్ పోస్టర్ లోనే ఎన్టీఆర్ ఇంట్రో వీడియోకి సంబందించిన హింట్ ఉందని కీరవాణి తెలిపారు. ఆ మోషన్ పోస్టర్ చూసి మీరు అర్థం చేసుకో గలిగితే మే 20న రానున్న ఎన్టీఆర్ ఫస్టల్ లుక్ వీడియో ఎలా ఉంటుందో అర్థం అవుతుందని కీరవాణి చెప్పుకొచ్చారు. దీంతో భీమ్ ఫర్ రామరాజు మోషన్ పోస్టర్ ని మరోసారి చూస్తున్నారు అభిమానులు. తారక్ ఎంట్రో లుక్ ని కనిపెట్టే పనిలో ఉన్నారు.