సీఎం భద్రత సిబ్బందికి కరోనా

దేశంలో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర కరోనా ప్రభావం అధికంగా ఉంది. సామాన్యులతో పాటు భద్రతాసిబ్బంది, వైద్యులు కూడా కరోనా‌ బారిన పడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ముగ్గరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. 

మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 11506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 485 మంది మృతి చెందారు. 1879 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర పౌరులందరికీ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది.