ఒకే ఇంట్లో 41మంది కరోనా
కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఒకటి. ఢిల్లీలో ఇప్పటివరకు 3,738 కరోనా కేసులు నమోదవగా, 61 మంది వైరస్ బాధితులు మరణించారు. తాజాగా ఢిల్లీలో ఒక ఇంట్లో 41మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఢిల్లీలోని కపెషెరాలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ సమీపంలో థెకే వాలి గాలిలో ఈ భవనంలో ఒక వ్యక్తికి ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏప్రిల్ 19న ఆ భవనాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఈ భవనంలో ఉంటున్న 67 మందిని క్వారంటైన్‌కు తలించారు. శనివారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 41 మందికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ బిల్డింగ్ చుట్టు పక్కల నివాసముంటున్న 175 మంది నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. ఇక మే 3 తర్వాత మరో రెండు వారాల పాటు అంటే.. మే 17వరకు లాక్ డౌన్ పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.