లావణ్యకి మెమోరీ లాస్

అందాల రాక్షిసి లావణ్య త్రిపాఠిక్ మెమరీ లాస్ అయింది. ఆమెకి ఏ విషయం గుర్తుండలేదట. కరోనాలాక్ డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఇస్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. 

అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ? అని ఓ అభిమాని అడగగా.. ‘మెమరీ లాస్.. గుర్తులేదు’ అని సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. తాను బోల్డ్ సీన్స్ లో నటించేందుకు రెడీ. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తానని చెప్పుకొచ్చింది. మా నాన్న లాయర్ (వకీల్ సాబ్) అంటూ ఫ్యామిలీ విషయాలు తెలిపింది. భవిష్యత్ లో వెబ్ సిరీస్ లో నటిస్తా. విజయ్ దేవరకొండతో నటించాలనుంది అని చెప్పుకొచ్చింది.