లారాకు సచిన్ విషెస్

విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా (5) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి క్రికెట్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా లారాకి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘సహచరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీతో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ. ఈ ఏడాది నీకు బాగుండాలని ఆశిస్తున్నా’నని సచిన్ రాసుకొచ్చారు. శిఖర్ ధవన్‌, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌ తదితరులు కూడా లారాకు బర్త్ డే విషెస్ తెలిపారు.