విజయ్’కి అలాంటి అమ్మాయి కావాలట

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండకి స్పష్టమైన ఆలోచనలు ఉంటాయ్. ఏదైనా ఆయన సూటిగా చెబుతున్నారు. అది పర్సనల్ విషయం అయినా.. సినిమా విషయం అయినా. ఇటీవల నేషనల్ మీడియాతో మాట్లాడిన విజయ్.. ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడారు. అమ్మాయిల విషయంలో తను కోరుకునే కొన్ని క్వాలిటీస్ వివరించాడు.

అలాంటి అమ్మాయి ఎదురుపడిందా అంటే.. ? అవుననే సమాధానం ఇచ్చాడు విజయ్. మరీ పెళ్లెప్పుడు అంటే.. ? మానసిక పరిపక్వత వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం జీవితంలో స్థిరపడాలని నా తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఆ దిశలో అడుగులు వేస్తున్నానని చెప్పాడు.

ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. విజయ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని విజయ్ భావిస్తున్నారు.