వారి త్యాగాలని గౌరవిద్దాం : మహేష్
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన ప్రాణాలని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్లు, పోలీసులు, స్వచ్ఛ కార్మికులు. ఈ నేపథ్యంలో వారి త్యాగాలని గౌరవిద్దామని సూపర్ స్టార్ మహేష్ అన్నారు. ఇప్పటికే పోలీసుల పనితీరుపై మహేష్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వారికి సెల్యూట్ చేశారు. తాజాగా వైద్యులపై జరుగుతున్న దాడులపై మహేష్ స్పందించారు.
‘వైద్యులపై ప్రేమ, గౌరవం చూపించాల్సిన అవసరం ఎంతైన ఉంది. సొంత ప్రాణాలని పణంగా పెట్టడంతో పాటు ఇష్టపడే వ్యక్తులని వదిలి యుద్ధ ప్రాంతంతో ఉండటం కష్టం. మనల్ని రక్షించే వైద్యులని మనం రక్షించాల్సిన అవసరం ఎంతైన ఉంది. వారి త్యాగాలని గౌరవిద్దాం. ఈ కష్ట సమయాల్లో మనం పరస్పర ఇచ్చుకోగల గొప్ప బహుమతి ప్రేమ మరియు సానుభూతి. వైద్య కార్యకర్తల పట్ల దయతో, మర్యాదపూర్వకంగా ఉండాలని మీరందరినీ కోరుతున్నాను వారే మన నిజమైన సూపర్ హీరోలు’ అంటూ మహేశ్ ట్విట్ చేశారు.
I stand in gratitude for all health workers who are working selflessly and tirelessly to keep us safe and secure in these trying times. We must come to understand that they're doing this to safeguard us. 🙏🙏 pic.twitter.com/QG5AlXrMMo
— Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2020
While it is hard to risk your own life, it is harder to leave behind people you love and be in a war zone. People who protect us need to be protected, let's respect and honour their sacrifices. The greatest gift we can give each other in these trying times is our love and empathy
— Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2020
I urge you all to be kind and courteous towards our medical workers… Our true superheroes. Huge respect.🙏🙏🙏 #StayHomeStaySafe #HumanitysHeroes #WeWillWin
— Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2020