కరోనా వారియర్స్‌కు అరుదైన గౌరవం

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన వైద్యులు, పోలీసులు, స్వచ్ఛ కార్మికులు, విలేకరులు ప్రాణాలు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. వీరి త్యాగాలని గుర్తించి ప్రధాని  నరేంద్ర మోడీతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ప్రశంసించారు. వారికి సెల్యూట్ చేశారు. తాజాగా కరోనా వారియర్స్‌కు అరుదైన గౌరవం దక్కింది. వారియర్స్‌కు సంఘీభావ సంకేతంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్ ఆస్పత్రులపై పూలవర్షం కురిపించింది.

హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సుమారు 1600మంది వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు అందిస్తున్నారు. వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో పూలవర్షం కురిపించింది భారత వాయుసేన. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురి పించాలని త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌రావత్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.