కరోనాపై ఏపీ కొత్త సరికొత్త విధానం
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో 1583 కరోనాకేసులు నమోదయ్యాయి. మరో 33మంది మృతి చెందారు. గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధరం చంద్రుడు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో ధైర్యాన్ని నింపే మెసేజ్, నెగిటివ్ వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్షలు చేసుకున్న వారికి సంక్షిప్త సమాచారం వెళ్తోంది.’ప్రియమైన వ్యక్తి పేరు, క్షమించండి. మీ ఐడీ కింద కోవిడ్ 19 పరీక్ష మీకు పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మీకు మెరుగైన వైద్య సేవలందింస్తుంది. మీరు కోవిడ్‌తో పోరాడి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అవుతారని’ సందేశం వస్తుంది. నెగిటివ్ అయితే..’ డియర్.. (పూర్తి పేరు) నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఐడీ నంబర్ 2461 కోవిడ్ -19 పరీక్ష నెగిటివ్ వచ్చిందని’ సందేశం వస్తుంది.