గుడ్ న్యూస్ : నెల రోజుల్లో కరోనాకి వాక్సిన్
ప్రపంచ దేశాలని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలోనూ కరోనా వేగంగా విజృంభిస్తోంది. అయితే మిగితా దేశాలతో పోలిస్తే భారత్ బెటర్ అని చెప్పవచ్చు. అయితే కరోనాకి వాక్సిన్ ఇప్పట్లో రావడం కష్టమే. ఈ యేడాది చివరలో కరోనాకి మందు రావొచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత అధికార వర్గాలు మాత్రం నెలరోజుల్లో కరోనాకి వాక్సిన్ వస్తుందని చెబుతున్నారు.
ఇండియాలోనే అత్యున్నతమైన పరిశోధన, అభివృద్ది సంస్థ సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్) ప్రస్తుతం కరోనా వైరస్ను నివారించే డ్రగ్ మీద ప్రయోగాలు చేస్తోంది. మరింత విస్తృతమైన ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కోరింది. అన్నీ కుదిరితే నెలరోజుల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
రెడీ చేసిన వాక్సిన్ ని ఇప్పటికే 50 మంది పేషెంట్ల మీద పరిశోధించారు. 30 నుంచి 45 రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహిస్తారు. సీఎస్ఐఆర్ అనుమతులు వచ్చాక ఫేజ్ 3ని పూర్తి చేయనున్నారు.