మహేష్ నవ్వుల పోస్ట్

‘నవ్వుతూ బతకాలిరా.. ‘ అంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కరోనా లాక్ డౌన్ తో సినీ తారలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉంటున్న మహేష్ బాబు హాయిగా ఫ్యామిలీతో గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేసి.. అభిమానులని మురిపిస్తున్నారు.
 
ఇక ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా మహేష్ తనయుడుగౌతమ్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫోటో ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. “నవ్వుతూ, ప్రేమిస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మీ జీవితాన్ని ఆనందంగా గడపండి” అంటూ మహేష్ కామెంట్ పెట్టాడు. ఈ నవ్వుల పోస్ట్ ని చూసి మహేష్ అభిమానులు సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మాయదారి మల్లిగాడు’ సినిమాలోని ‘నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడు. నవ్వుతూ సావలిరా..’ పాటని గుర్తుకు తెచ్చుకొంటున్నారు.