తెలంగాణలో 134 కంటెయిన్మెంట్లు

కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించి ఆ ప్రాంతంలోకి ప్రజల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నారు. ఆ ప్రాంతంలో నివసించే వారికి అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వ సిబ్బందే సమకూర్చుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 350 కంటెయిన్ మెంట్లు ఏర్పాటు చేయగా 216 కంటెయిన్ మెంట్లను ఎత్తేశారు. ప్రస్తుతం 134 కంటెయిన్ మెంట్లు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో కరోనా బారిన పడ్డవారు కోలుకుంటున్న ప్రాంతాల్లో కంటెయిన్ మెంట్లు ఎత్తేస్తున్నారు. అలాగే కొత్తగా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 1082 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 29మంది కరోనాతో మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 545 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 508 మంది చికిత్స పొందుతున్నారు.