రాశీఖ‌న్నాది ప్రేమ వివాహ‌మే


హీరోయిన్ రాశీఖన్నా పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. కరోనా లాక్‌డౌన్ తో సినీతారలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ సమయాల్లో నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త పనులు ట్రై చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చడిస్తున్నారు. తాజాగా రాశీఖన్నా అభిమానులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీ ఓటు పెద్ద‌లు కుదిర్చిన పెళ్లికా, ప్రేమ వివాహానికా ? అని అడిగాడు. దానికి రాశీ స్పందిస్తూ త‌న‌కు తెలిసి ప్రేమ వివాహానికే అని తెలిపింది. అంటే.. రాశీఖ‌న్నా ప్రేమ వివాహ‌మే చేసుకుంటుంద‌న్న మాట అని నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే రాశీలో ప్రేమలో పడిందా ? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ యేడాది రాశీఖన్నా నటించిన ఫేమస్ వరల్డ్ లవ్వర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇందులో రాశీ బోల్డ్ సీన్స్ లో నటించింది. ఇటీవల ఈ సీన్స్ పై స్పందించిన రాశీ.. అలాంటి సీన్స్ లో నటించి ఉండాల్సింది కాదంది. ఇకపై అలాంటి సీన్స్ లో కనిపించనని తెలిపింది.