కరోనా వాక్సిన్ : ట్రంప్ కీలక ప్రకటన
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మనసులో ఏదీ దాచుకోలేరు. బయటికి కక్కేస్తూనే ఉంటారు. ఇప్పుడు కరోనా వాక్సీన్ విషయంలోనూ ఆయన ఆపులేకపోయారు. వ్యాక్సిన్ ఎప్పటికల్లా వస్తుందనే విషయంలో ట్రంప్ ని ఏం మాట్లడవద్దని అమెరికా వైద్యులు సూచించారట. కానీ ‘నాకు ఏది తోస్తే అది మాట్లాడతా’ అంటూ అంటూ ఈ యేడాది చివరికల్లా కరోనా వాక్సిన్ వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో దీనిపై ముమ్మర స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
ఇంకే దేశమైనా తమకంటే ముందే తయారు చేస్తే ఇంకా మంచిదని.. ఎవరు చేశారన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం కాదు.. మహమ్మారి మెడలు వంచే వ్యాక్సిన్ వస్తే చాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. మహమ్మారి కరోనా వైరస్ కి వాక్సిన్ కనిపిట్టే పనిలో ప్రపంచదేశాలు ఉన్న సంగతి తెలిసందే. ఏ దేశం ముందు కరోనాకి వాక్సిన్ తీసుకొస్తే.. ఆ దేశం ప్రపంచానికి సేవ చేసినట్టే.