ఆన్ లైన్ లో ‘మాస్టర్’ రిలీజ్
కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. అసలు ఈ యేడాదిలో థియేటర్స్ తెరచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్స్ తెరచుకున్న కరోనా కలవరంతో జనాలు థియేటర్స్ కి మునుపటిలా క్యూకడతారనే ఆశ లేదు. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘మాస్టర్’ సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై సహ నిర్మాత లలితకుమార్ స్పందించారు. ‘మాస్టర్ చిత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేసే ఆలోచన ఏమాత్రం లేదు. కరోనా సమస్య ముగిసిన తర్వాత థియేటర్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. విడుదలకు సంబంధించి వస్తున్న వదంతులను అభిమానులు నమ్మాల్సిన పనిలేదు’ అని వివరణ ఇచ్చారు.