పవన్ రిమేక్ లో మెగాస్టార్ ?

‘వకీల్ సాబ్’తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో ఒకట్రెండు సినిమాలకి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారమ్. ఈ క్రమంలో గతంలో పవన్ నటిస్తారనే ప్రచారం జరిగిన ‘వేదాళం’ సినిమా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారమ్.

ప్రస్తుతం మెగాస్టార్.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. అంతేకాదు.. సుకుమార్, సుజీత్, బాబీ, హరీష్‌ శంకర్‌, మెహర్ రమేష్, పరశురామ్‌, అనిల్ రావిపూడిలు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో మెహర్‌ రమేష్‌ కూడా  ఉండటంపై మెగా ఫ్యాన్స్‌ నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తమైంది.

అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మెహర్ రమేష్ తో సినిమా చేయాలి. అతనికి బ్రేక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న చిరు.. వేదాళం రిమేక్ ని ఎంచుకున్నారట. ఈ సినిమా విషయంలో కథ మొదలు ప్రొడక్షన్ కూడా తానే దగ్గరుండి చూసుకోవాలని చిరు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే గతంలో పవన్ కోసం అనుకున్న వేదాళం రిమేక్ లో పవన్ కనిపించబోతున్నారని అభిమానులు చెప్పుకొంటున్నారు.