ప్రగతి ఆంటీని గెలికిన స్టార్ కమెడియన్ ఎవరు ?
సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో శృంగార కోరికలు తీర్చాలన్న వార్తలు కొత్తేమీ కాదు. #మీటూ ఉద్యమంలో భాగంగా ఇలాంటి సీన్లు చాలానే బయటికొచ్చాయ్. అయితే కొత్తగా వచ్చేవారికి మాత్రమే కాదు.. సీనియర్ నటీమణులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారట. తెలుగులో తల్లి, వదిన, అత్త పాత్రలు చేసుకొంటూ ప్రగతి దూసుకెళ్తున్నారు. ప్రగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేధు అనుభవాన్ని గురించి చెప్పింది.
‘ఓ సినిమా షూటింగ్ టైంలో ఓ కమెడియన్ తనను చాలా ఇబ్బంది పెట్టాడు.సెట్‌లో చాలా ఇబ్బంది పెట్టడంతో క్యారావాన్ లోకి తీసుకెళ్లి.. మీ ప్రవర్తన చాలా ఇబ్బందిగా ఉందని వార్నింగ్ ఇచ్చా. అయితే ఆ తర్వాత అతడు సైలెంట్ అయిపోయినా.. మిగిలిన వారి దగ్గర మాత్రం నాకు చాలా పొగరు, అహంకారం అని ప్రచారం చేశాడు’ అని వాపోయింది. ఇంతకు ప్రగతి ఆంటీని బాగా ఇబ్బంది పెట్టిన ఆ స్టార్ కమెడియన్ ఎవరు ? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.