టాలీవుడ్ కి గుడ్ న్యూస్.. జూన్ 1న ?

మూడో విడత లాక్ డౌన్ లో మొత్తం 17 రంగాలకి కేంద్రం సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకి కూడా షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలనే విజ్ఝప్తులు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ గురించి సమాలోచనలు చేస్తోంది. జూన్ ఫస్ట్ నుంచి కొన్ని పరిమితులతో షూటింగ్ లకు అనుమతి ఇచ్చే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ లు, గ్లవ్స్, థెర్మల్ గన్ లు, శానిటైజర్ ఛాంబర్లు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం వుంది. అయితే థియేటర్ల అనుమతి మాత్రం ఇప్పుడే వుండకపోవచని తెలుస్తోంది.

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన సినీ తారలు గొప్ప మనసు చాటుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలు ఇవ్వడంతో పాటు సినీ కార్మికులని ఆదుకున్నారు. అంతేకాదు.. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తమవంతు ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో సినిమా వాళ్లని ఇబ్బంది పెట్టకుండా.. సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ అనుమతి ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ ఆలోచిస్తోంది.