ఏపీలో తమిళనాడు మందుబాబులు హంగామా
మందుబాబులు 40రోజులుగా కరువులో ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ తో 40రోజులుగా మద్యం షాపులు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఏపీలో ఇవాళ మద్యం షాపులు తెరచుకున్నాయి. 25 శాతం ధరలు పెంచి ఏపీ ప్రభుత్వం అమ్మకాలు ప్రారంభించినా.. మందుబాబులు తగ్గలేదు.
ఈ ఉదయం మద్యం షాపులు తెరవకముందే.. వచ్చి క్యూలో నిలబడ్డారు. కిలో మీటర్ల మేర మందుబాబులు క్యూలో నిలబెట్టారు. ఈ సందర్భంగా సామాజిక దూరం అనే నిబంధనని గాలికొదిలేశారు. ఇక ఏపీకి తమిళనాడు మందుబాబులు క్యూ కట్టారు. తమిళనాడు నుంచి చిత్తూరుకు పెద్ద ఎత్తున మందుబాబులు తరలివస్తున్నారు.
తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం దుకాణం తెరచుకోవడంతో తమిళనాడు ప్రాంతవాసులు ఇక్కడికి తరలివచ్చి హల్ చల్ చేశారు. ఏపీ బార్డర్ లో ఉన్న తెలంగాణ గ్రామాల ప్రజలు కూడా మందు కోసం ఏపీకి వెళ్లారు. మొత్తంగా ఏపీలో మందుబాబుల మొహాల్లో మునపటి కళొచ్చింది.