ఇలా అయితే కష్టం.. జగన్ : చంద్రబాబు

మూడో విడత లాక్‌డౌన్ లోభాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఏపీలో ఇవాళ మద్యం షాపులు తెరచుకున్నాయి. ఉదయం 11గంటల నుంచి రాత్రి 7గంటల వరకు మద్యం అమ్మకాలకి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే 40రోజుల తర్వాత మద్యం షాపులు తెరచుకోవడంతో మందు బాబుల ఆనందానికి అవధుల్లేవ్. అదే సమయంలో ఇది కరోనా కాలం అని మరిచిపోయారు. నిబంధనల ప్రకారం ఒక్కో మద్యం షాపు దగ్గర ఐదుగురికి మించి క్యూ లైన్ లో ఉండకూడదు. కానీ కిలో మీటర్ల మేర మందు బాబులు క్యూ కట్టారు. సోషల్ డిస్టెన్స్ లేదు.. పాడు లేదు.

 మందు దొరికితే కరోనాపై గెలిచినట్టే అన్నట్టుగా క్యూ లైన్స్ లో నిలబడి యుద్ధం చేశారు. మద్యం షాపుల వద్ద మందుబాబుల క్యూ లైన్ చూసి తెదేపా అధినేత చంద్రబాబు షాక్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మద్యం షాపుల ముందు కనీస నియమాలు కూడా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. ఇలా అయితే కష్టం అంటూ.. సీఎం జగన్ కి ట్యాగ్ చేశారు. ఇక ఏపీలో ఇవాళ కొత్తగా 67కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1650కి చేరింది.