శివాజీరాజాకు గుండెపోటు
ప్రముఖ నటుడు, మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకి మంగళవారం రాత్రి సడెన్ గా గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు శివాజీరాజా స్నేహితుడు సురేష్ కొండేటి తెలిపారు.
ఒక్కసారిగా బీపీ తగ్గడంతో గుండెపోటు వచ్చినట్టు డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ చేసి.. స్టంట్స్ వేయనున్నట్టు తెలిసింది. ఇక శివాజీరాజాకి గుండెపోటు అనే న్యూస్ సినీ పరిశ్రమని ఉలిక్కిపడేలా చేసింది. అయితే.. మరో 24గంటలు గడిస్తే.. శివాజీరాజా
ఆరోగ్యపరిస్థితిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.