‘ఆర్ఆర్ఆర్’కు సీత కష్టాలు


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమాకు సీత కష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. సీత పాత్రలో అలియా కనిపించనున్నారు.

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్ వాయిదా పడ్డాయి. లేదంటే ఆర్ఆర్ఆర్ పూణె షెడ్యూల్ లో అలియా పాల్గొనేది. జూన్ రెండో వారం నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అలియా బాలీవుడ్ లో బిజీగా ఉండటం, ఇటీవల అలియాకి కాబోయే మామ, రణ్ బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ చనిపోయిన నేపథ్యంలో అలియా.. ఆర్ ఆర్ ఆర్ కి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి వ్యూహాత్మకంగా స్పందించినట్టు అనిపిస్తోంది. ” ‘ఆర్ఆర్ఆర్’ తాను డిజైన్ చేసిన సీత పాత్ర చాల అమాయకంగా కనిపిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎదురు దాడికి సిద్దపడే మానసిక ధృఢత్వంతో ఉంటుంది. అలాంటి పాత్ర ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క అలియా భట్ కు తప్ప మరెవ్వరికి నప్పదు” అన్నారు జక్కన్న.