చిరుకి రిప్లై ఇచ్చిన త్రిష

సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష మెగా ఆఫర్ ని వదులుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’ఆచార్య’ సినిమా కోసం ముందుగా త్రిషని హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వలన సినిమా నుంచి తప్పుకుంటున్న త్రిష తెలిపింది. దీనిపై స్పందించిన మెగాస్టార్.. చిత్రబృందంతో త్రిషకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమెకి మణిరత్నం సినిమా ఆఫర్ రావడంతో మా సినిమా నుంచి తప్పుకున్నట్టుంది అన్నారు. దీనిపై కూడా త్రిష నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా చిరుకి త్రిష రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

సోమవారం త్రిష పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వీరందరికీ త్రిష కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషని విష్ చేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు త్రిష. నీ జీవితం సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నా’నని ట్వీట్ దీనికి త్రిష రిప్లై ఇచ్చారు. స్వీటెస్ట్ లెజెండ్ చిరంజీవికి ధన్యవాదాలు అనిపోస్ట్ చేశారు.