తెలంగాణలో కొత్త మద్యం ధరలు ఇవే.. !

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. ఈ నెల 29 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్. మద్యం షాపులకి సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరేంజ్, గ్రీన్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూ మద్యం దుకాణాలకి అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకి తెలంగాణలో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. దీంతో మందు బాబులు మద్యం దుకాణాలకి క్యూ కట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 2వేల 200 మద్యం దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. కంటైన్ మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అన్ని జోన్లలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. కంటైన్ మెంట్ జోన్లలో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇక మద్యం ధరలని ప్రభుత్వం యావరేజ్ గా 16 శాతం పెంచింది. ఆ ధరలని ఇలా ఉన్నాయి. 

* ఆర్డినరీ 90 ఎంఎల్ , 180 ఎంఎల్ లిక్కర్ పై రూ.10 పెంపు

* 375 ఎంఎల్ పై రూ. 20 పెంపు

* 750 ఎంఎల్ పై రూ. 40 అదనంగా పెరిగింది

* మీడియం లిక్కర్ పై 90 ఎంఎల్, 180 ఎంఎల్ పై రూ.20 పెంపు

* 375 ఎంఎల్ పై రూ. 40 పెంపు

* 750 ఎంఎల్ పై రూ. 80 పెరిగింది

* అన్ని సైజుల బీర్లపై రూ.30 పెరిగింది