అసలు విశాఖ ‘ఎల్.జీ పాలిమర్స్’లో ఏం జరిగింది ?
విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టరైన్ గ్యాస్ లీకైంది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
అసలు ఎల్.జీ పాలిమర్స్ లో ఏమంది అంటే.. ? ఎల్.జీ పాలిమర్స్ సౌత్‌కొరియా కంపెనీ. లాక్‌డౌన్ నుంచి పరిశ్రమలకు మినహాయింపు తర్వాత తిరిగి ప్రారంభించారు. సుమారు 3గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టెరైన్ వాయువు లీకైంది. ఆ సమయంలో జనాలంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆక్సిజన్ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది.