విశాఖ ఘటనపై చిరు స్పందన

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి స్టరైన్ గ్యాస్ లీకైన ఘటనలో 8 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దీంతో సాయంత్రానికల్లా మృతుల సంఖ్య బాగా పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. చాలా మృగజీవులు కూడా మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా”నని చిరు ట్విట్ చేశారు.