ఆ విషయంలోనూ ప్రభాస్’నే ముందు.. !

కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే టైమొచ్చేస్తోంది. దీంతో మన స్టార్స్ ఎక్కడ, ఎవరితో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారని తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొనడం సాధారణం. ఇప్పటి వరకు ఏ స్టార్ కూడా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చెప్పనేలేదు. వాటి కోసం అభిమానులు ఆరాతీసే పనిలో పడ్డారు. ఐతే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడంలోనూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందున్నట్టు కనిపిస్తోంది.

‘బాహుబలి’తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలితో వచ్చిన క్రేజీని కాపాడుకోడానికి పక్కాగా ప్లాన్ చేసుకొంటున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహో’ని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ని తీసుకొన్నారు. ఇప్పటికే ‘సాహో’ కు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

వచ్చే యేడాది జనవరి 5 నుంచి మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఐతే, దొరికిన గ్యాప్ లో ఫారిన్ ట్రిప్’కి వెళ్లాడు డార్లింగ్. లాస్‌ ఏంజిల్స్‌లో హాలిడేలో ఉన్నాడు. న్యూ ఇయర్’ని అక్కడే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. తిరిగొచ్చాక జనవరి 5 నుంచి సాహో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ ఏకధాటిగా 45 రోజులు నిర్వహించనున్నారు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న సాహో వచ్చే యేడాది సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇంతకీ అక్కడ ప్రభాస్ ఒక్కడే ఉన్నాడా ? అతనితో పాటు స్వీటీ అనుష్క కూడా ఉందా ?? అని ఆరా తీస్తున్నారు ఆయన అభిమానులు. ఏదేమైనా బాహుబలి లాంటి సినిమాలు తీయడంలోనే కాదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడంలోనూ తమ హీరోనే ముందున్నాడని చెప్పుకొని మురిసిపోతున్నారు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు.