విశాఖ గ్యాస్ లీకు.. కారణం ఇదే !

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 11 మంది మృతిచెందగా.. మరో 200మందికి పైగా అస్వస్థకి గురయ్యారు. వీరిలో 33 మందికి సీరియస్ గా ఉంది. అయితే ఈ గ్యాల్ లీక్ ఘటనకి కారణమేంటీ ? అన్నది ఇప్పుడు అందరి మతులని తొలచేస్తున్న ప్రశ్న. గ్యాస్ లీకుగల కారణాలని విశాఖ జిల్లా కలెక్టర్ సీఎం జగన్ కి వివరించారు.

విశాఖ వెళ్లి బాధితులని పరామర్శించిన సీఎం జగన్.. కేజీహెచ్ హాస్పటల్ లో అధికారులతో సమావేశం అయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. లీకైన రసాయనం ఎప్పుడూ ద్రవ రూపంలో, 20 డిగ్రీల ఉష్ణోగ్రత లోపే ఉండాలి. సంస్థలో తలెత్తిన సాంకేతిక లోపాలవల్లే రసాయనం వాయు రూపంలోకి మారింది జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సీఎంకు వివరించారు. 

ఇక  లీ కైన స్టైరీన్‌ గ్యాస్‌ పీల్చిన వారికి కళ్ల మంట, గొంతునొప్పి, వాంతులయ్యాయని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. మంచినీటితో కళ్లు శుభ్రం చేసుకోవాలని సూచించారు. బాధితులు వెంటనే ఆక్సిజన్‌ థెరఫీ తీసుకోవాలని కోరారు. ఈ వాయువుతో దీర్ఘకాలిక ప్రభావం తక్కువే ఉంటుందని అన్నారు.