ఔరంగబాద్‌లో దారుణం.. వలస కూలీలపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు !
లాక్‌డౌన్ టైంలో వలస కూలీల బాధలు వర్ణారహితం. సొంత ఊళ్లకి వెళ్లలేక.. ఉన్న చోట తిండిలేక దుర్బర జీవితాలని గడుపుతున్నారు. అయితే మూడో లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా వలస కూలీలని సొంత గ్రామాలకి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సొంత ఖర్చులతో సొంత ఊళ్లకి వెళ్లాలని కేంద్రం ప్రకటించడంతో.. దారి ఖర్చులకి డబ్బుల్లేని వాళ్లు నడకతో వెళ్తున్నారు.
మధ్య ప్రదేష్ కి చెందిన వలస కూలీలు మహారాష్ట్రలోని జాల్ లా నుంచి వలస కూలీలు సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ కు రైలు పట్టాలను అనుసరిస్తూ బయల్దేరారు. మార్గమధ్యంలో విశ్రాంతికోసం రైలు పట్టాలపై నిద్రిస్తున్న సమయంలో గూడ్స్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.