సల్మాన్ ఫాం హౌజ్’లో జాక్వెలిన్.. మాములుగా ఎంజాయ్ చేయలేదుగా !

కరోనా లాక్ డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం తన ఫామ్ హౌజ్ లో వాలిపోయాడు. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా సల్మాన్ ఫాంహౌజ్‌లోనే ఉంటుంది. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియాలో తాజాగా జాక్వెలిన్ తన ఇన్ స్టా గ్రమ్ లో షేర్ చేసింది.

కొత్త రోజుని స్వాగతిస్తూ ఆమె లేవగా, తర్వాత స్నానం చేయడం, పెంపుడు జంతువలకి ఆహారం పెట్టడం, గుర్రపు స్వారీ చేయడం, బట్టలు ఆరబెట్టడం, తనకి తాను కాఫీ పెట్టుకోవడం, డియర్ క్వారంటైన అనే నోట్‌తో పాటు ఇతర రోజువారీ కార్యకలాపాలని ఆ వీడియోలో చూపించింది.  కొబ్బరి చెట్టు ఎక్కే ప్రయత్నం కూడా చేసింది గుర్రపు స్వారీ చేసి.. ఇలా ప్రతి పనిని ఆస్వాదించింది జాక్వెలిన్. ఆ వీడియోని మీరు చూసేయండీ.. !