రైతులకి కష్టాలు రానీయం : కేటీఆర్

తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 25 వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నగదును నిన్న ఆర్థికశాఖ విడుదల చేసింది. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ ప్రస్తుతం లాకడౌేన్‌ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులను నేరుగా బదిలీ చేయాలని నిర్ణయించింది.
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని  ట్వీట్‌ చేశారు. రైతు రుణమాఫీకి రూ. 1200 కోట్ల విడుదలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో రైతు రుణమాఫీ కింద 5.50 లక్షల మంది లబ్ది పొందుతారని పేర్కొన్నారు. వానాకాలం రైతుబంధుకు కూడా రూ. 7 వేల కోట్ల విడుదల చేయడంతో ఈ పథకం కింద 57 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ కానుందని కేటీఆర్‌ తెలిపారు.