గుడ్ న్యూస్ : ఈ నెల 18 నుంచి తెరచుకోనున్న థియేటర్స్

సినిమా ప్రియులకి గుడ్ న్యూస్. ఈ నెల 18 నుంచే థియేటర్స్ తెరచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ తో మార్చి 25 నుంచి థియేటర్స్ మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయనే విషయంలో క్లారిటీ లేదు. అసలు ఈ  యేడాదిలోనే థియేటర్స్ తెరచుకొనే పరిస్థితులు లేవనే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి సినీ ప్రియులకి తీపి కబురు అందింది. 

ఈనెల 18 నుంచి గ్రీన్ జోన్ లో షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రెడ్ జోన్స్, అరంజ్ జోన్స్ మిన‌హా గ్రీన్ జోన్ లో మూడు ఆట‌ల‌కు అనుమ‌తులివ్వ‌నుంది. రాత్రి 7 గంట‌ల లోపు మూడు ఆట‌లు పూర్తి కావాల‌నే నిబంధ‌న విధించ‌నుంది.. అలాగే సినిమా హాల్స్ లో సీటు కి సీటు మ‌ధ్య గ్యాప్ ఉండాల‌నే సూచించింది. ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించాల‌ని నిబంధ‌న విధించింది. మాస్క్ ధ‌రించాల‌ని కోరింది.