హ్యాపీ బర్త్ డే.. రౌడీ హీరో !

విజయ్ దేవరకొండ.. ఓ సంచలనం. ‘పెళ్లి చూపులు’తో నచ్చేశాడు. ‘అర్జున్ రెడ్డి’తో షాక్ ఇచ్చాడు. ఎంతలా అంటే.. ? ఇన్నాళ్లు ఈ ఆణిముత్యం ఎక్కడున్నాడు అన్నంతగా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో యూత్ కి కనెక్ట్ అయిన కథానాయకుడు కరువయ్యాడు. ఆ లోటుని విజయ్ ని తీర్చాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే.. స్టార్ హీరో కాదు.. అంతకుమించి. సినిమా సినిమాకి ప్రేక్షకులకి షాక్ ఇవ్వడమే విజయ్ లక్ష్యం.

పెళ్లి చూపులు చూసినోళ్లు ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండని చూసి షాక్ కావాల్సిందే. ఇక అర్జున్ రెడ్డిగా కనిపించిన విజయ్ ‘గీత గోవిందం’లో విజయ్ గోవింద్ గా ఒదిగిపోయి నటించడం ప్రేక్షకులకి డబుల్ షాక్. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవ్వర్.. ఇలా ప్రతి సినిమాలోనూ వైవిద్యం చూపించాడు.

ఓ హీరో స్టార్ హీరో కావడం సహజమే కావొచ్చు. కానీ అంతకుమించి అనిపించుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. విజయ్ లో సాధారణ యువకుడు కనిపిస్తాడు. ఆయన మాటల్లో నిజాయితీ, నిజం కనిపిస్తుంటుంది. అందుకే విజయ్ స్టార్ హీరో అంతకుమించి అనిపించుకున్నాడు. ఇండియన్ సినిమాని దున్నేయడమే విజయ్ లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ.. రౌడీ హీరో హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

ప్రస్తుతం విజయ్ ‘ఫైటర్’ సినిమా చేస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. విజయ్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ ప్రభావం తగ్గాక తిరిగి షూటింగ్ మొదలు కానుంది. ఫైటర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నారు.