న్యూఇయర్.. పొలిటికల్ ఇయర్…!?
కొత్త ఏడాదిపై రాజకీయ పార్టీలు కొత్త ఆశలు పెంచుకుంటున్నాయి. ఒకరకంగా ఎలక్షన్ ఇయర్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా న్యూఇయర్ లో ముందుకు వెళ్లేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయట ఆయా పార్టీలు.
సంస్థాగతంగా బలోపేతానికి ఈ ఏడాది చేసిన ప్రయత్నం ఒక రకంగా సఫలీకృతమైనట్లేనని, 2017లో ఎదురైన అపజయాలను, పొరపాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది, మేమంటే మేమంటూ చెప్పుకుంటున్నాయి.
అదే స్పూర్తిని కొనసాగిస్తు న్యూఇయర్ లో తమ పార్టీలను మరింత బలోపేతం చేసుకోవాలని వ్యూహాలు రచించుకుంటున్నారు. విపక్ష పార్టీల బలం తగ్గి మళ్లీ అధికారం పొందేందుకు టీఆర్ఎస్ కూడా పావులు కదుపుతోంది. ఎలక్షన్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు వచ్చే న్యూఇయర్ అన్ని రాజకీయ పార్టీలకు కీలక సంవత్సరంగా మారుతోంది. చూడాలి మరి న్యూఇయర్ ఏ పార్టీకి కొత్త జోష్ ను నింపుతుందో..