బాలీవుడు రాముడు, రావణాసురుడు.. వీరే !
రామాయణం.. వింటే మధురం. చూస్తే.. కమణీయం. అందుకే 1987లో వచ్చిన ‘రామాయణం’ సీరియల్ ని ఇటీవల టెలికాస్ట్ చేస్తే రికార్డు సృష్టించింది. టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోయాయ్. అయితే ఇప్పటి నటీనటులతో రామాయణం తెరకెక్కించాలంటే.. ఏ పాత్రకి ఎవరు సరిపోతారు ? వీటికి సమాధానం చెప్పారు రామాయణం సీరియస్ లో సీత పాత్రలో నటించిన దీపికా చిఖలియా. ప్రస్తుతం ఈవిడ బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టీస్టుగా నటిస్తున్నారు.
దీపికా చిఖిలియా ఏమన్నారంటే.. ? ఇప్పుడు రామాయణం తెరకెక్కించాలంటే.. రాముడి పాత్ర కోసం హృతిక్ రోషన్ సరిపోతారు. సీత పాత్ర కోసం అలియా భట్ ని తీసుకోవాలి. లక్ష్మణుడిగా వరుణ్ ధావణ్ నటిస్తే బాగుంటుంది. రావణాసురుడు పాత్ర కోసం అజయ్ దేవగన్ సరిపోతాడని చెప్పుకొచ్చింది. రామాయణం లాంటి సీరియల్ ని మళ్లీ తీయడం కుదురుతుందో.. లేదో.. ? కానీ ‘మహాభారతం’ తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకధీరుడు రాజమౌళి ఉన్నారు. మహాభారతం పనులు మొదలుపెట్టారు. ఆ సమయంలో మరే పనులు పెట్టుకోవద్దు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.