రకుల్ ప్రేమ పెళ్లికి.. ఇంట్లో గ్రీన్ సిగ్నల్ !

స్టార్ హీరోయిన్ రకుల్ పెళ్లి చేసుకోబోతుందా ? అంటే ఇప్పట్లో లేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ పెళ్లిపై ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రకుల్ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు. కానీ తాను ఎవరిని కోరుకుంటే అతనిని ఇచ్చి చేస్తాం అని తెలిపింది. అంటే.. రకుల్ ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అన్నమాట.

ఇక ఇటీవల రకుల్ వైన్ షాప్ కి వెళ్లింది. క్యూ లో నిలబడి మద్యం కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. దీనిపై రకుల్ ఘూటుగా స్పందించింది. ‘మందుల షాపులో లిక్కర్ దొరకుతుందా ? అంటూ ప్రశ్నించింది. మందుల షాపు వెళ్లిన రకుల్ వీడియోని మద్యం షాపుకి వెళ్లినట్టు ఎడిట్ చేసి.. విడుదల చేసిన వీడియో అది. ఇక ‘మన్మథుడు 2’ తర్వాత తెలుగులో రకుల్ మరో సినిమా చేయలేదు. కోలీవుడ్, బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది.