ఈ రాత్రికే దిల్ రాజు వివాహం

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ రాత్రికే పెళ్లి. రాత్రి 11 గంటలకి ముహూర్తం. దిల్ రాజు తన  ఫ్యామిలీ ఫ్రెండ్ ను వివాహం చేసుబోతున్నారు. దిల్ రాజు స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా నార్సింగ్ పల్లి గ్రామంలో ఈ వివాహం జరగబోతుంది. దిల్ రాజు స్వయంగా కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు రాత్రి 11-00 గంటలకు వివాహం జరగనుంది.

అతి కొద్దిమంది సన్నిహితులు , కుటుంబసభ్యుల మధ్య ఈ పెళ్లి జరగనుంది. ఇక ఈ పెళ్ళికి దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి పెద్దగా వ్యవహరిస్తోంది. ఈ ఉదయమే పెళ్లిపై దిల్ రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. తన వ్యక్తి గత జీవితంలో సరికొత్త మలుపు తిరుగబోతున్నదని, ఈ కొత్త మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయమౌతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

దిల్ రాజు భార్య అనిత మూడు సంవత్సరాల క్రితం మరణించారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటున్నారు.