దిల్ రాజు పెళ్లి చేసుకోబోయేది.. ఈవిడనే !

ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత మూడు సంవత్సరాల క్రితం మరణించారు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు. ఆయన రెండో పెళ్లి చేసుకోనే ప్రయత్నాల్లో ఉన్నారు. సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొన్నారు. ఆమె వయసు 30 యేళ్లు అనే ప్రచారం ఇటీవల కాలంలో జరిగింది.

దిల్ రాజు రెండో పెళ్లి విషయంలో ఇన్నాళ్లు జరిగింది అంతా ఉత్తిత్తి ప్రచారమే. తాజాగా దిల్ రాజు రెండో పెళ్లిపై అధికారిక ప్రకటన చేశారు. తన వ్యక్తి గత జీవితంలో సరికొత్త మలుపు తిరుగబోతుందని ప్రకటించారు. ఈ రోజు రాత్రి 11గంటలకి దిల్ రాజు స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా నార్సింగ్ పల్లిలో శ్రీవెంకటేశ్వర ఆలయంలో దిల్ రాజు పెళ్లి జరగనుంది దిల్ రాజు తన  ఫ్యామిలీ ఫ్రెండ్ ను వివాహం చేసుబోతున్నారు. ఆమె పేరేంటీ ? ఇతర వివరాలు మాత్రం తెలియాల్సి ఉన్నాయి.