‘టచ్ చేసి చూడు’ ఫస్ట్ లుక్


ఈ యేడాది ‘రాజా ది గ్రేట్’ సినిమాతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. దాదాపు రెండేళ్ల తర్వాత రవితేజ నుంచి వచ్చిన ఈ చిత్రాన్ని ఆయన అభిమానులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఈ యేడాదియే రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లిన మరో సినిమా ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరికొండ దర్శకుడు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. ఈ సినిమాని వచ్చే యేడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఫైట్ సీన్ లోని స్టయిలీష్ లుక్ ఫస్ట్ లుక్ గా వదిలినట్టు కనబడుతోంది. రవితేజ ఎనర్జిటిక్ లుక్ ఆకట్టుకొనేలా ఉంది. ఈ సినిమాతో సక్సెస్ ని కంటిన్యూ చేయాలని రవితేజ ఆశపడుతున్నాడు. ఈ సినిమాకి నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మాతలు. వచ్చే యేడాది కోసం రవితేజ రెండు సినిమాలని లైన్లో పెట్టేశాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్ ‘, శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా ఉండనుంది.