12 నుంచి రైళ్లు నడవనున్నాయ్.. !
కరోనా లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే మూడో విడత లాక్ డౌన్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తోంది. ఇప్పటికే వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. తాజాగా మే 12వ తేదీ నుంచి దశల వారీగా పాసింజర్ రైళ్లను కూడా నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
ఢిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్ళుగా దేశంలోని 15 ముఖ్య నగరాలకు వీటిని నడపనున్నారు. ఢిల్లీ నుంచి దిబ్రూఘర్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్ గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిలకు అక్కడి నుంచి దిల్లీకి ఈ రైళ్లు తిరగనున్నాయి. ఇక పాసింజర్ రైళ్లలో రిజర్వేషన్లు మే 11వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మొదలవుతాయి. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు.