దోమలపై యుద్ధం ప్రకటించిన కేటీఆర్


ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా ఫీవర్ లో ఉంది. దాన్నుంచి ఎప్పుడు బయటపడతామో చెప్పలేని పరిస్థితి. కరోనాని పూర్తిగా అంతం చేసేందుకు ఇంకా వాక్సిన్ రాలేదు. ఈ నేపథ్యంలో కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి. అయితే కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే.. కరోనాని మన దరికి చేరకుండా చూసుకోవచ్చు. సామాజిక దూరం, మాస్క్ మాస్క్ ధరించడంతో పాటు పరిశుభ్రతని పాటించాలి.

అసలే రాబోయేది వర్షాకాలం. కరోనాతో పాటు రకరకాల సీజన్ వ్యాధులు విజృంభించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధోమలపై యుద్ధం ప్రకటించారు. ఇందుకోసం #10minsAt10am అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకి 10 నిమిషాల పాటు ప్రతి ఒక్కరు ఇంట్లో.. నీటి నిల్వ ఉండే ప్రదేశాలని శుభ్రం చేసుకోవాలి.

నీటి నిల్వ ఉన్నచోట ధోమలు ఉంటాయి. వాటిని శుభ్రం చేయడం ద్వారా ధోమలని అరికట్టవచ్చు. తద్వారా సీజన్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ పిలిపుతో ఈ ఆదివారం చాలా మంది #10minsAt10am కార్యక్రమంలో పాల్గొన్నారు. పది ఆదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.