దిల్ రాజుకు కూతురు పెళ్లి విషెస్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త జీవితం ప్రారంభించారు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నారు. ఆమె డిటేల్స్ ఏవీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని దిల్ రాజు ఫాంహౌజ్‌లో వీరి వివాహం జరిగింది. కొద్ది మంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగినట్టు తెలుస్తుంది. ఈ శుభకార్యానికి దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి పెద్దగా వ్యవహరించినట్టు తెలిసింది.
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు అందించింది హన్సిత రెడ్డి. “డియర్ డాడ్.. నువ్వు నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచావు. మీ వలన అందరం సంతోషంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. మీరిద్దరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజు అద్భుతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా”నని హన్సిత ప్రకటనలో తెలిపారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. దిల్ రాజు నిర్మాత వ్యవహరించిన ‘వి’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గి.. థియేటర్స్ తెరచుకోగానే ‘వి’ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అతథిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు నిర్మాతగా వహిస్తున్న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఆఖరి దశలో ఉంది.