వైరల్ : దిల్ రాజు పెళ్లి ఫోటోలు


ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని దిల్ రాజు ఫాంహౌజ్‌లో వీరి వివాహం జరిగింది. కొద్ది మంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. అయితే దిల్ రాజు పెళ్లాడింది ఎవరు ? ఆవిడ వివరాలేవీ బయటికి రాలేదు. కనీసం పెళ్లికి ముందు వరకు ఆమె ఫోటో కూడా బయటికి రాలేదు. తాజాగా దిల్ రాజు పెళ్లి ఫోటోలు వచ్చేశాయి. ఓ మూడ్నాలుగు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్యామిలీ ఫ్రెండుని దిల్ రాజు పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. ఆమె యంగ్ గానే ఉన్నారు. గతంలో దిల్ రాజు 30యేళ్ల యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు -ప్రచారం జరిగింది. పెళ్లి ఫోటోలని చూస్తే.. ఆమె వయసు కూడా అంతే అనిపిస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్స్ దిల్ రాజుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి కూడా తండ్రికి పెళ్లి రోజుశుభాకాంక్షలు తెలిపారు. తండ్రి జీవింతం బాగుండాలని ఆకాంక్షించారు.