సీఎం’లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. మూడో విడత లాక్ డౌన్ మరో ఆరు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. లాక్ డౌన్ ను కొనసాగిస్తారా? సడలిస్తారా? అని దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గతంలో నాలుగు సార్లు ప్రధాని ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మెజారీటీ సీఎం’లు లాక్ డౌన్ పొడగింపునకి మెగ్గు చూపారు.
అయితే ఈ సారి పరిస్థితి మారింది. నాల్గోసారి లాక్ డౌన్ కొనసాగింపునకి రాష్ట్రాలు రెడీ లేవు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల అంశాలను పలు రాష్ట్రాలు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. ఎఫ్ ఆర్ బీఎం పరిధి పెంపు, ఎంఎస్ ఎంఈ సహా పారిశ్రామిక రాయితీల అంశాలను ప్రధాని వద్ద లేవనెత్తే అవకాశం ఉంది. ఇక రెండు సెషన్స్ గా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు తొలి సెషన్ సాయంత్రం 6గంటల నుంచి రెండో సెషన్ జరగనుంది.