ఉద్యోగులకి గుడ్ న్యూస్.. కోతల్లేవట !

కరోనా ప్రభావంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రయివేటు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలని పూర్తిగా చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏ స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినా… జీతంలో ఎలాంటి కోతలు ఉండవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.