రానా సడెన్ సప్రైజ్ వెనక.. !
భల్లాలదేవుడు రానా దగ్గుపాటి భయంకరమైన షాక్ ఇచ్చాడు. ‘ఆమె ఓకే చెప్పేసింది’. ఇదిగో నా ప్రేయసి. ఆమె పేరు మిహికా బజాయ్ అంటూ ప్రేయసితో దిగిన ఫోటోలని షేర్ చేశాడు. ఏకంగా పెళ్లి ప్రకటన చేసేశాడు. అసలు రానా ఇంత సలైంట్ గా తతంగం నడుపుతారని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ? రానా గత చరిత్ర అలాంటిది.
గతంలో రానా-త్రిషకు లింకుపెట్టి బోలేడు ప్రచారం జరిగింది. వీరిద్దరు పెళ్లి చేసుకొనేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరిగింది. త్రిష పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు.. దానికి కారణం రానానే అనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు హీరోయిన్స్ తో లింకుపెట్టి రానా పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో రానా ప్రేమ, పెళ్లి విషయాలు ఈజీగా బయటికి పొక్కుతాయ్.. వైరల్ అవుతాయి అనుకున్నారు. కానీ, రానా చాలా సైలైంట్ గా ప్రేయసి పరిచయం, పెళ్లి ప్రకటన అంతా ఒకేసారి వచ్చేలా ప్లాన్ చేశాడు. అంతా క్షణాలో గడిపోయింది.
దీని వెనక రానా పక్క ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ‘కాఫీ విత్ కరణ్’షోలో దర్శకుడు రాజమౌళిచెప్పినట్టు.. రానా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తాడు. పెళ్లి విషయంలోనూ అంతే క్లారిటీ ఉన్నాడని నిరూపించాడు. ఇక మిహీకా బజాజ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పెద్దదేనని తెలిసింది. మొత్తానికి.. మిహీకా-రానా జంట బాగుంది. ఈ ప్రేమజంట త్వరగా పెళ్లి చేసుకోవాలని.. సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.